రైతును ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం...అక్కడికక్కడే మృతి

by Sridhar Babu |
రైతును ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం...అక్కడికక్కడే మృతి
X

దిశ, ఖానాపూర్ : నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని సుర్జాపూర్ గ్రామానికి చెందిన పన్నెల భీమేశ్ (54) అనే రైతును గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టడంతో భీమేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. భీమేశ్ మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మామడ ఎస్ఐ సందీప్ తెలిపిన వివరాల ప్రకారం ఖానాపూర్ మండలంలోని సుర్జాపూర్ గ్రామానికి చెందిన పన్నెల భీమేష్ అనే రైతు వైద్యం కోసం నిర్మల్ జిల్లా కేంద్రమైన ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని తన స్వగ్రామం సుర్జాపూర్ కు తిరిగి మోటార్ బైక్ పై వస్తుండగా మార్గ మధ్యలోని మామడ మండలంలోని దిమ్మదుర్తి గ్రామ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో ఆయన అక్కడికక్కడే మరణించాడు. మృతునికి ఇద్దరు కుమారులు, భార్య తిరుమల ఉన్నారు. మృతుని కుమారుడు సందీప్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story

Most Viewed