ఆసుపత్రిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

by Sridhar Babu |
ఆసుపత్రిలో గుర్తుతెలియని వ్యక్తి  మృతి
X

దిశ, తిరుమలగిరి : ఆసుపత్రిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్‌పల్లిలోని జేబీఎస్ బస్టాండ్ నిజామాబాద్ ప్లాట్‌ఫాం సమీపంలోని వాటర్ ట్యాంక్ వద్ద ఓ గుర్తు తెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. అది గమనించిన ఆర్టీసీ సెక్యూరిటీ గార్డు మల్లేష్ పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాడు. దాంతో తమ బ్లూకోట్ కానిస్టేబుల్ మణిరాజ్ సంఘటనా స్థలానికి చేరుకొని అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిని 108 అంబులెన్స్‌ ద్వారా గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా మృతి చెందాడు. మృతుడు యాచకుడిగా పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్​ఐ తెలిపారు.

Next Story

Most Viewed