జగిత్యాలలో సంచలన ఘటన.. 80 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం!!

by Disha Web |
జగిత్యాలలో సంచలన ఘటన.. 80 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం!!
X

దిశ, జగిత్యాల: రోజురోజుకు మానవ సంబంధాలు మంటకలిసిపోతున్నాయి. ఆడవాళ్ళపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టేందుకు ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా.. నిత్యం ఏదోచోట దారుణాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మైతపూర్‌లో జరిగిన ఓ పాశవిక సంఘటన సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేసింది. 80 సంవత్సరాల పండు ముసలి వయసులో ఉండి మంచానికే పరిమితమైన వృద్ధురాలిపై అత్యాచారం జరిగింది. వివరాల ప్రకారం.. మైతపూర్‌ గ్రామానికి చెందిన ఓ 80 ఏళ్ల వృద్ధురాలు తన సోదరితో ఒకే ఇంట్లో పక్కపక్క గదుల్లో ఉంటున్నారు.

పూర్తిగా మంచానికే పరిమితమైన బాధితురాలిపై అదే గ్రామానికి చెందిన పుట్ట గంగారాం (54) సోమవారం అగాయిత్యానికి ఒడిగట్టినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. గత కొన్ని రోజులుగా మంచానికే పరిమితమైన సదరు వృద్ధురాలికి.. కుటుంబ సభ్యులు గురువారం ఉదయం స్నానం చేయించే సమయంలో తీవ్ర రక్త స్రావం జరగడంతో ఆరా తీసిన కుటుంబ సభ్యులకు ఆత్యచారం జరిగినట్లు నిర్దారణకు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో రోజు పలకరించే ఇంటి సమీపంలో ఉండే గంగారాం అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. గురువారం ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కృష్ణ కుమార్ తెలిపారు.

Telugu News , Latest Telugu News. Telangana News. Political News. Cinema News. Crime News. AP News. Web Stories. Latest Photo Galleries

Next Story

Most Viewed