విలువైన ఆభరణాలు చోరీ చేసిన నిందితులు అరెస్ట్

by Jakkula Mamatha |
విలువైన ఆభరణాలు చోరీ చేసిన నిందితులు అరెస్ట్
X

దిశ, అమలాపురం: అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కిమ్స్ మెడికల్ కళాశాల ప్రాంగణంలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడిలో గత నెల 4వ తేదీన చోరీకి పాల్పడి స్వామివారి ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు తక్కువ సమయంలోనే ఈ కేసును చేదించి దొంగలను అరెస్టు చేశారు. మంగళవారం కోనసీమ జిల్లా ఎస్పీ కార్యాలయంలో పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కృష్ణారావు మాట్లాడుతూ కిమ్స్ మెడికల్ కళాశాల ప్రాంగణంలో వెంకటేశ్వర స్వామి గుడిలో పోయిన మొత్తం ఆభరణాలు రికవరీ చేశామన్నారు. 70 లక్షల రూపాయల విలువైన 868 గ్రాముల బంగారు ఆభరణాలు, 8.56 కేజీల వెండి ఆభరణాలు‌ దొంగలను నుంచి స్వాధీనం చేసుకున్నారు. కేసును చేదించడంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన సీఐలు వీరబాబు, ప్రశాంత్ కుమార్, ఎస్సై శేఖర్ బాబులను ఎస్పీ కృష్ణారావు అభినందించి వారికి రివార్డులు అందజేశారు.

Advertisement

Next Story

Most Viewed