బ్రేకింగ్: జైలు నుండి బయటకొచ్చిన నవీన్ మర్డర్ కేసు నిందితురాలు

by Disha Web |
బ్రేకింగ్: జైలు నుండి బయటకొచ్చిన నవీన్ మర్డర్ కేసు నిందితురాలు
X

దిశ, వెబ్‌డెస్క్: నవీన్ అనే బీటెక్ యువకుడి మర్డర్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రియురాలి కోసం క్లోజ్ ఫ్రెండ్ అయిన నవీన్‌ను హరిహరకృష్ణ అనే యువకుడు అతి దారుణంగా హత్య చేయడం రాష్ట్రంలో కలకలం రేపింది. యువతి కోసం దారుణంగా హత్య చేయబడ్డ నవీన్ హత్య కేసులో పోలీసులు నిందితుడు హరిహరకృష్ణతో పాటు అతడి ప్రియురాలిని కూడా అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. కాగా, ప్రస్తుతం జైలులో ఉన్న ఆ యువతికి రంగారెడ్డి జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆ యువతి చంచల్ గూడ జైలు నుండి బయటకు వచ్చింది. నవీన్ మర్డర్ కేసులో యువతి A-3 నిందితురాలిగా ఉంది.
Next Story