పక్కా సమాచారం....అడ్డంగా దొరికిన గంజాయి విక్రేత

by Sridhar Babu |
పక్కా సమాచారం....అడ్డంగా దొరికిన గంజాయి విక్రేత
X

దిశ, బోయినిపల్లి : గంజాయిని విక్రయిస్తున్న వ్యక్తిని బోయినిపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై పృథ్వీ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం ఓ వ్యక్తి జగ్గరావుపల్లి గ్రామ శివారులో ఉన్న రైస్ మిల్లు వద్ద గంజాయి విక్రయిస్తున్నాడన్న పక్కా సమాచారంతో వెంటనే తమ సిబ్బంది అక్కడికి చేరుకొని తనిఖీలు చేయగా కొండవేణి గంగాధర్ అనే వ్యక్తి గంజాయి విక్రయిస్తూ పట్టుబడ్డాడని, దీంతో వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని 64 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

Next Story