బంధువులను పరామర్శించేందుకు వెళ్తుండగా ప్రమాదం.. వ్యక్తి దుర్మరణం

by Kalyani |
బంధువులను పరామర్శించేందుకు వెళ్తుండగా ప్రమాదం.. వ్యక్తి దుర్మరణం
X

దిశ,శివ్వంపేట : ఆసుపత్రిలో ఉన్న వ్యక్తిని పరామర్శించడానికి వెళ్తుండగా ఆర్టీసీ బస్సు-ఢీకొని వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన శివ్వంపేట మండలం దొంతిలో చోటు చేసుకుంది. శివ్వంపేట ఎస్ఐ మధుకర్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవల్లి గ్రామానికి చెందిన శీతాల వెంకటేశం(42), భార్య సుమలత తూప్రాన్ లోని ఓ ఆసుపత్రిలో ఉన్న వ్యక్తిని పరామర్శించడానికి మంగళవారం ఉదయం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. దొంతి శభాష్ పల్లి మధ్యలో ఆర్టీసీ బస్సు, బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో భార్య సుమలతకు తీవ్ర గాయాలు కాగా భర్త అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఇతనికి ముగ్గురు కుమారులు అభిరామ్ (7), అంకిత్ కుమార్ (4), ఠాగూర్(2) ఉన్నారు. భార్య సుమలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై మధుకర్ రెడ్డి తెలిపారు.

Next Story

Most Viewed