పెబ్బేరు బైపాస్ రోడ్డుపై ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు..

by Kalyani |
పెబ్బేరు బైపాస్ రోడ్డుపై  ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు..
X

దిశ, పెబ్బేర్: మున్సిపాలిటీ పరిధిలోని హైదరాబాద్ నుంచి పెబ్బేరు వచ్చే బైపాస్ రోడ్డులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎస్సై జగదీశ్వర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జడ్చర్ల మండల పరిధి నాగసాల గ్రామానికి చెందిన నరసింహ, అతని కుమారుడు సుదర్శన్ ఇద్దరూ వాళ్ల సొంత గ్రామం నుంచి పెబ్బేరు సంతకు కోళ్ల వ్యాపారం నిమిత్తం బైక్ పై వెళ్తున్నారు.

బొలెరో వాహనం కూడా పెబ్బేరు వైపునకు వస్తుండగా బైపాస్ లో వెనుక నుంచి అతివేగంతో బైకు ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకుపై ఉన్న ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో వనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ప్రమాదంపై ఎలాంటి ఫిర్యాదు అందకపోవడంతో కేసు నమోదు చేయలేదని ఎస్ఐ జగదీశ్వర్ రెడ్డి తెలిపారు

Next Story

Most Viewed