ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగళం

by Dishafeatures2 |
ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగళం
X

దిశ, డైనమిక్ బ్యూరో : గుంటూరు జిల్లా మంగళగిరి హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆఫీసుపై ఏసీబీ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. అంతర్ జిల్లాల పరస్పర బదిలీల దరఖాస్తులను ప్రాసెస్ చేసేందుకు రూ.40వేలు లంచం తీసుకుంటున్న సూపరింటెండెంట్‌ సయ్యద్ లయీక్ అహ్మద్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా అరుంధతి నగర్ గ్రామానికి చెందిన నరేంద్ర బాబు, ఆయన భార్య మరియు 7 ఇతర గ్రేడ్-III ఏఎన్ఎంల అంతర్ జిల్లాల పరస్పర బదిలీల నిమిత్తం సూపరింటెండెంట్ సయ్యద్ లయీక్ అహ్మద్‌ను సంప్రదించారు. దరఖాస్తులను ప్రాసెస్ చేయడానికి రూ.40 వేల లంచం డిమాండ్ చేశాడు. దీంతో నరేంద్రబాబు ఏసీబీని ఆశ్రయించాడు.

దీనిపై కేసు నమోదు చేసుకున్న అధికారులు ఈ రోజు గుంటూరు జిల్లా మంగళగిరి హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయ సూపరింటెండెంట్, ఎస్టాబ్లిష్‌మెంట్ విభాగం సయ్యద్ లయీక్ అహ్మద్ ఫిర్యాది దారుడు వద్ద నుండి 16 వేల రూపాయలు లంచంగా తీసుకుంటుండగా గుంటూరు రేంజ్ అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. అనంతరం ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. అవినీతి అధికారులపై ప్రజల ఫిర్యాదు కోసం అందుబాటులో ఉంచిన 14400 నెంబర్‌ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, ఎవరైనా అధికారులు వేధింపులకు పాల్పడితే ప్రజలు ఈ నెంబర్ ద్వారా అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించ వచ్చని డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి పేర్కొన్నారు.

Next Story

Most Viewed