తెలంగాణలో సంచలన ఘటన.. ఒక్క అమ్మాయి కోసం 100 మంది.. (వీడియో)

by Disha Web |
తెలంగాణలో సంచలన ఘటన.. ఒక్క అమ్మాయి కోసం 100 మంది.. (వీడియో)
X

దిశ, తుర్కయాంజల్: రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో ఓ యువతి కిడ్నాప్ కలకలం రేపింది. వైశాలి అనే యువతి ఇంటిపై దాదాపు 100 మంది యువకులు దాడి చేసి.. యువతిని ఎత్తుకెళ్లారు. యువతిని తీసుకెళ్తున్న క్రమంలో అడ్డుకున్న అమ్మాయి తల్లిదండ్రులపై, స్థానికులపై దాడి చేయడంతో పాటు.. యువతి ఇంటిని పూర్తిగా ధ్వంసం చేశారు. దీంతో తమ కూతురిని 100 మంది కలిసి కిడ్నాప్ చేశారని బాధిత యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కిడ్నాపర్లను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఘటన స్థలిని ఇబ్రహీంపట్నం ఏసీపీ ఉమామహేశ్వరరావు పరిశీలించారు. కాగా, యువతిని కిడ్నాప్ చేసింది టీ టైం ఓనర్‌గా నవీన్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story