ఫోన్ పే ట్రాన్స్‌క్షన్‌తో పరిచయం.. 90 రోజుల శృంగారం తర్వాత..

by Disha Web |
ఫోన్ పే ట్రాన్స్‌క్షన్‌తో పరిచయం.. 90 రోజుల శృంగారం తర్వాత..
X

దిశ, వెబ్‌డెస్క్ : నేటి యువత పెళ్లికి ముందే శృంగారం చేయడానికి తహతహలాడుతుంది. మొదట స్నేహం.. ఆ తర్వాత ప్రేమ అంటూ హద్దులు మీరుతున్నారు. పెళ్లి పేరిట ముందస్తుగానే శృంగారానికి అలవాటుపడుతున్నారు. లివ్ ఇన్ రిలేషన్ షిప్ అంటూ సహజీవనం చేస్తున్నారు. మోజు తీరాక ముఖం చాటేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే రాజస్థాన్‌లో జరిగింది.

రాజస్థాన్‌కు చెందిన విష్ణు పూణెలోని ఓ బట్టల షోరూంలో సెల్స్ మెన్‌గా పని చేస్తున్నాడు. అయితే ఆ షోంరూంకు తరచుగా ఓ యువతి వచ్చేది. ఆమె ఆ షాపులో ఫోన్ పే ద్వారా డబ్బులు చెల్లించడంతో ఆ నంబర్‌ తీసుకుని విష్ణు యువతితో పరిచయం పెంచుకున్నాడు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఆ తర్వాత పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడిన ఆ జంట ఇరు కుటుంబాలకు తెలియకుండా ఎంగేజ్ మెంట్ చేసుకుంది. ఈ క్రమంలో ఇద్దరు కలిసి భార్యభర్తలుగా చెప్పుకుంటూ ఓ రూం అద్దెకు తీసుకుని సహజీవనం చేశారు. ఇలా మూడు నెలలు గడిచాక విష్ణు.. రాజస్థాన్ వెళ్లి తన తల్లిదండ్రులను పెళ్లికి ఒప్పించి వస్తానని వెళ్లిపోయాడు.

అయితే ఈ జంట అనుకున్న దానికి వ్యతిరేఖంగా తల్లిదండ్రుల నుంచి రియాక్షన్ వచ్చింది. వీరిద్దరి పెళ్లికి ఆమె ప్రియుడి పేరెంట్స్ ఒప్పుకోకపోగా.. ఆ యువతిని పెళ్లి చేసుకుంటే తామందరం ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించాడు. దీంతో ప్రియుడు సైతం మనసు మార్చుకుని ప్రియురాలికి ముఖం చాటేశాడు. రాజస్థాన్ వెళ్లిన ప్రియుడి నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో యువతి నేరుగా అతడి గ్రామానికి వెళ్లింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆమెను బెదిరించారు. ఒంటరిగా వచ్చిన నిన్ను యువకుడి తల్లిదండ్రులు చంపేస్తారని, ఇక్కడి నుండి వెళ్లిపోవాలని హెచ్చరించారు. దీంతో తాను మోసపోయనని గ్రహించిన యువతి నేరుగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed