కన్నింగ్ కామాంధుడు.. ఓ వైపు అమ్మాయిలు, మరోవైపు ఆంటీలు.. అసభ్యకరంగా..!

by Disha Web Desk |
కన్నింగ్ కామాంధుడు.. ఓ వైపు అమ్మాయిలు, మరోవైపు ఆంటీలు.. అసభ్యకరంగా..!
X

దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియా వచ్చిన తర్వాత యువత స్టైల్ మారిపోయింది. తమ టాలెంట్‌ను నిరూపించుకునేందుకు దీనిని ప్లాట్‌ఫామ్‌గా ఉపయోగించుకుని ఎంతో మంది వెండి తెరకు, బుల్లి తెరకు పరిచయం అయ్యారు. అయితే కొంతమంది కేటుగాళ్లు ఇదే సోషల్ మీడియాను దుర్వినియోగం చేసుకుని కటకటాల పాలయ్యారు. రెండో కోవకు చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి అమ్మాయిల జీవితాలతో ఆడుకోవాలని చూసి అడ్డంగా బుక్కయ్యాడు. తోటి మహిళా ఉద్యోగినులతో అమ్మాయిలా ఛాటింగ్ చేస్తూ కామ కోరికలు తీర్చుకోవాలని ప్రయత్నించాడు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం దిగువమారేడిపల్లెకు చెందిన అనిల్.. ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అదే ఆఫీసులతో అతడితో పాటు పనిచేస్తున్న యువతులపై అనిల్ కన్నుపడింది. వారిని పరిచయం చేసుకుని.. స్నేహం నటిస్తూ వారిని మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నించడం మొదలుపెట్టాడు. అనిల్ దుర్భుద్దిని పసిగట్టిన యువతులు అతడిని దూరం పెట్టారు. యువతులతో వర్కౌట్ కాదనుకున్న కేటుగాడు రూటు మార్చి పెళ్లైన వారిపై కన్నేశాడు. తనతో పనిచేసే ఓ వివాహితను పరిచయం చేసుకొని తన కోరిక తీర్చుకునేందుకు యత్నించాడు. అందుకు ఆమె ఒప్పుకోకపోగా అనిల్‌ను పట్టించుకోవడం మానేసింది.

ఆమెపై కక్షగట్టిన కామాంధుడు.. ఆమె పేరుతో ఓ ఫేక్ ఫేస్‌బుక్ ఐడీ క్రియేట్ చేసి.. ఆమెకే ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడు. తాను ఓ మహిళగా పరిచయం చాటింగ్ చేస్తూ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. అలా చాలా మంది మహిళలు, యువతులను పరిచయం చేసుకుని ఛాంటింగ్ చేస్తూ పైశాచిక ఆనందం పొందాడు. ఆ తర్వాత వాడిలోని కామపిశాచిని బయటపెట్టి వారికి అసభ్యకర మెసేజ్ లు పంపుతూ వికృత రూపాన్ని బయటపెట్టాడు. అయితే అతడి కన్నింగ్ ప్లాన్ గమనించిన ఓ వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె కంప్లైంట్ తో స్పందించిన పోలీసులు.. ఫేస్ బుక్ ఐడీ ఆధారంగా దర్యాప్తు చేయగా.. అనిలే అమ్మాయి పేరుతో ఫేస్ బుక్ ఐడీ క్రియేట్ చేసి ఇదంతా చేస్తున్నట్లు గుర్తించారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. అపరిచిత వ్యక్తుల నుంచి ఫ్రెండ్ రిక్వెస్టులు వస్తే మహిళలు అప్రమత్తంగా ఉండాలని.. అలాంటి వారిని నమ్మి జీవితాలు ప్రమాదంలో పడేసుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.


Next Story

Most Viewed