- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బ్రిడ్జికి ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య..

దిశ, మంగపేట : జీవితంపై విరక్తితో ఓ వ్యక్తి బ్రిడ్జికి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మంగపేట మండలంలో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. బంధువులు తెలిపిన వివరాల్లోకెళితే మండల కేంద్రం పద్మశాలి వాడకు చెందిన సురేష్ (37) ఏటూరునాగారం రామాలయం వీధికి చెందిన రేణుక అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరూ బేకరీలో పని చేసుకుంటూ కొంత కాలంగా అక్కడే జీవిస్తున్నారు.
మద్యానికి బానిసైన సురేష్ పనులకు వెల్లకుండా భార్యతో గొడవపడుతూ కాలం వెల్లదీస్తూ నెల రోజుల క్రితం మంగపేటలోని తన అక్క నర్సమ్మ ఇంటికి వచ్చినట్లు తెలిపారు. ఈ క్రమంలో అనారోగ్యానికి గురైన సురేష్ ను అక్క, ఆమె పిల్లలు ఏటూరునాగారంలోని సామాజిక ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించి భార్యకు సమాచారం అందించారు. ఈ క్రమంలోనే ఆదివారం గౌరారం వాగు బ్రిడ్జికి సురేష్ ఉరివేసుకుని కనిపించినట్లు స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ఏటూరునాగారం సామాజిక ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.