కారు కాలువలో పడి యువకుడు మృతి

by Disha Web |
కారు కాలువలో పడి యువకుడు మృతి
X

దిశ, జగిత్యాల టౌన్ : జగిత్యాల జిల్లా దరూర్ క్యాంపు ఎస్సారెస్పీ కెనాల్ లో అదుపు తప్పి కారు పడిపోవడంతో యువకుడు మృతి చెందిన ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. జగిత్యాల పట్టణానికి చెందిన ఐదుగురు యువకులు చల్గల్ బైపాస్ నుండి అంతర్గాం మీదుగా జగిత్యాల వస్తున్న క్రమంలో ఎస్సారెస్పీ కెనాల్ కాలువలో కారు అదుపుతప్పి పడిపోయింది. దీంతో డ్రైవింగ్ చేస్తున్నబీట్ బజార్ కు చెందిన రిజ్వాన్ అనే జర్నలిస్టు కారులోనే చిక్కుకుపోగా సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు అతడికి సీపీఆర్ చేసి రక్షించే ప్రయత్నం చేశారు. రిజ్వాన్ ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించే క్రమంలో మృత్యువాత పడినట్లు సమాచారం. కారులో ప్రయాణిస్తున్న మిగతా యువకులు స్వల్ప గాయలతో క్షేమంగా బయటపడినట్లు తెలుస్తోంది. రిజ్వాన్ ఓ దిన పత్రికలో మేడిపల్లి మండల రిపోర్టర్ గా పని చేస్తున్నట్లు తెలుస్తుంది. మేడిపల్లి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన రిజ్వాన్ కొంత కాలంగా జగిత్యాల పట్టణంలోని బీట్ బజారులో నివాసం ఉంటున్నట్లు సమాచారం.ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.Next Story