అగ్నిపథ్ కు ఎంపిక కాలేదని యువకుని ఆత్మహత్య..

by Disha Web |
అగ్నిపథ్ కు ఎంపిక కాలేదని యువకుని ఆత్మహత్య..
X

దిశ, తాంసి : ఉద్యోగం వస్తుందని ఎంతో ఆశతో ఎదురుచూసిన ఓ యువకుడు ఉద్యోగం రాలేదని మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే మండలంలోని కప్పర్ల గ్రామానికి చెందిన మోహన్, లలిత దంపతుల ఏకైక కుమారుడు కార్తీక్ (21) ఇటీవల అగ్నిపథ్ ఉద్యోగానికోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఇటీవల జరిగిన రాత పరీక్షలో ఉత్తమ ప్రతిభ సాధించినప్పటికీ చివరికి ఉద్యోగం రాలేదని మనస్థాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎదిగిన కొడుకు అర్థాంతరంగా తనువు చాలించాడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Next Story