ప్రేమ పేరుతో మోసం: గర్భవతిని చేసి ముఖం చాటేసిన ప్రియుడు

by Disha Web Desk 19 |
ప్రేమ పేరుతో మోసం: గర్భవతిని చేసి ముఖం చాటేసిన ప్రియుడు
X

దిశ, కల్లూరు: నిన్నే ప్రేమించాను అన్నాడు.. నువ్వు లేకుంటే బ్రతకలేను అని నమ్మించాడు. ప్రేమగా మాయ మాటలు చెప్పి.. ఆపై శారీరకంగా లొంగదీసుకున్నాడు. గర్భం దాల్చడంతో గర్భ నిరోధక మాత్రలతో అబార్షన్ చేయించాడు. నేడు మా కుటుంబ సభ్యులు ఒప్పుకోవడం లేదు అంటూ మొఖం చాటేశాడు ఓ ప్రభుద్ధుడు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ బాధిత యువతి ప్రియుడి ఇంటి ముందు మౌన దీక్షకు దిగింది. వివరాల ప్రకారం.. కల్లూరు మండల పరిధిలోని మర్లపాడు ఎస్సీ కాలనికి చెందిన ఓ యువతి (23) అదే గ్రామానికి చెందిన మోదుగు హరికృష్ణ (23) ఇద్దరు ఒకే కాలేజ్‌లో డిగ్రీ అభ్యసించారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడి అది కాస్తా ప్రేమగా మారింది. దీంతో వారి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది.

గత 5 సంవత్సరాలుగా ఇరువురు అనేక సార్లు శారీరకంగా ఒక్కటవ్వడంతో సదరు యువతి గర్భం దాల్చింది. విషయం తెలిసిన ప్రియుడు హరిక్రిష్ణ యువతికి గర్భ నిరోదక మాత్రలతో అబార్షన్ చేయించాడు. అనంతరం హరికృష్ణ తన కుటుంబ సభ్యులు ఒప్పుకోవడం లేదని.. నేను నిన్ను పెళ్లి చేసుకోలేనని యువతిని దూరం పెడుతున్నాడు. ఈ విషయంపై యువతి అతడని నిలదీసింది. విషయం యువతి తల్లిదండ్రులకు తెలియడంతో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టగా.. ఆ యువతిని పెళ్లి చేసుకునేందుకు తాము అంగీకరించమని యువకుడి తల్లిదండ్రులు తేల్చి చెప్పారు. దీంతో యువతి తనకు న్యాయం చేయాలని.. రెండు రోజులుగా యువకుడి ఇంటి ఎదుట మౌన దీక్షకు దిగింది.


Next Story

Most Viewed