- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
కూతురి ప్రియుడితో తల్లి డీల్.. సినిమాను మించిన ట్విస్ట్ తో శవమైన మహిళ
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రియుడి మైకంలో మునిగితేలుతున్న తన మైనర్ కూతురి విషయంలో ఓ తల్లి వేసిన ప్లాన్ బెడిసి కొట్టింది. సినిమాను మించిన ట్విస్ట్ లో చివరకు తల్లే బలికావాల్సి వచ్చింది. యూపీలోని ఎటా జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటనలో పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే అంశాలు వెలుగు చూశాయి. జశ్రత్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్టోబర్ 6న అల్లాపూర్ గ్రామానికి చెందిన అల్కా (35) అనే మహిళ మృతదేహం వెలుగు చూసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులకు షాకింగ్ విషయం తెలిసింది.తన 17 ఏళ్ల కూతురు ప్రేమలో పడిందని తెలుసుకున్న అల్కా తన కూతురిపై సీరియస్ అయింది. ఇక్కడే ఉంటే ఆమె మరింతగా ప్రియుడి మైకంలో పడిపోతుందని భావించి ఫారూఖాబాద్ లోని తన పుట్టింటికి పంపింది అల్కా. అక్కడికి పంపినా కూతురు ప్రవర్తనలో మార్పు రాలేదు. ఫోన్ లో గంటల తరబడి ప్రియుడితో మాట్లాడుతున్నదని తన పుట్టింటి నుంచి సమాచారం వచ్చింది. దీంతో మరింత కోపంతో రగిలిపోయిన అల్కా.. ఇక తన కూతురును చంపేయాలనే డెసిషన్ తీసుకుంది.
బెడిసికొట్టిన సుఫారీ:
తన కూతురిని మర్డర్ చేసేందుకు సుభాశ్ సింగ్ అనే వ్యక్తితో రూ.50 వేలతో డీల్ చేసుకుంది. అయితే తాను డీల్ చేసుకున్న సుభాశ్ సింగే తన కూతురు ప్రియుడు అని అల్కా తెలుసుకోలేకపోయింది. అల్కా ప్లాన్ విన్న సుభాష్ తొలుత షాక్ కు గురయ్యాడు. ఆ తర్వాత జరిగిన విషయం అంతా తన ప్రియురాలికి వివరించాడు. ప్రియుడి మాటలు విని ఆ యువతి విస్తుపోయింది. ఈ సిట్యుయేషన్ ను ఆసరగా చేసుకున్న సుభాష్ మరో ప్లాన్ చేశారు. అల్కా అడ్డు తొలగించుకుంటే మనిద్దరం పెళ్లి చేసుకుని హాయిగా ఉండవచ్చని ప్రియురాలితో చెప్పాడు.
అతడి మాటలు విన్న సదరు యువతి ప్రియుడితోనే కలిసి తన తల్లి మర్డర్ కు రివర్స్ ప్లాన్ సు సిద్ధమైంది. దీంతో కూతురు ఆమె ప్రియుడు ఇద్దరు కలిసి పథకం అల్కాను ఆగ్రాకు రప్పించారు. అక్కడి నుంచి ఎటాహ్ కు వెళ్లి రామ్ లీలా జాతరకు వెళ్లారు. అనంతరం నాగ్లా చందన్ వద్దకు తీసుకెళ్లి అక్క అల్కా గొంతుకోసి చంపేసారు. కూతురిని చంపాలనుకున్న అల్కా చివరకు ఆమెనే బలికావాల్సి వచ్చింది. ఈ ఘటనలో యువతితో పాటు ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సినిమాను తలపించేలా ఉన్న ఈ క్రైమ్ స్టోరీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Read More Crime news : కత్తులతో బెదిరించి.. అత్తాకోడళ్లపై గ్యాంగ్‌రేప్