మహిళ దారుణ హత్య.. ఆ అనుమానంతోనే రోజంతా కొట్టి..?

by Satheesh |
మహిళ దారుణ హత్య.. ఆ అనుమానంతోనే రోజంతా కొట్టి..?
X

దిశ, కుత్బుల్లాపూర్: దేవేందర్ నగర్‌లో ఓ మహిళ దారుణ హత్యకు గురైన సంఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మేడ్చల్ జిల్లా గాజులరామారం సర్కిల్ పరిధిలోని దేవేందర్ నగర్ బతుకమ్మబండలో బాలకృష్ణ, మమత(44) దంపతులు ముగ్గురు పిల్లలతో నివాసముంటున్నారు. అయితే శుక్రవారం మధ్యాహ్నం అపస్మారక స్థితిలో ఉన్న మమతను అంబులెన్సులో వైద్యశాలకు భర్త తరలిస్తుండగా స్థానికులు గమనించారు. ఏమైందని అడిగితే గురువారం ఉదయం పేడ తీసుకువచ్చేందుకు వెళ్లిందని, ఈరోజు ఉదయం 5 గంటలకు చెరువు వద్ద స్పృహ తప్పి పడిపోగా ఇంటికి తీసుకువచ్చామని, చికిత్స కోసం తరలిస్తున్నామని కట్టుకథ అల్లినట్లు సమాచారం.

ఆమెపై ఉన్న నగలు కన్పించలేదని, అతను చెబుతున్న వివరాలు సరిగా లేకపోవడంతో అనుమానంతో స్థానికులకు పోలీసులకుసమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించే పనిలో పడ్డారు. క్లూస్ టీంతో పరిశీలించగా ఒంటిపై గాయాలతో మృతి చెందినట్లు తెలిసింది. ఇంటికున్న సీసీ కెమెరాలు 15 రోజులుగా పనిచేయక పోవడం అనుమానాలకు తావిస్తోంది. భర్త బాలకృష్ణ, కుమారులు లక్ష్మణ్, శంకర్‌లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో రోజంతా కొట్టి హత్య చేసినట్లు స్థానికంగా చర్చించుకుంటున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీకి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed