భద్రాద్రిలో తల్లి కూతుళ్లు గల్లంతు.. కూతురిని రక్షించిన స్థానికులు

by Dishafeatures2 |
భద్రాద్రిలో తల్లి కూతుళ్లు గల్లంతు.. కూతురిని రక్షించిన స్థానికులు
X

దిశ, వెబ్ డెస్క్: భారీ వర్షాలతో రాష్ట్రంలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇక వర్షాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా వ్యవసాయ పనులు ముగించుకొని తిరిగి వస్తుండగా తల్లి కూతుళ్లు వరద నీటిలో గల్లంతైన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కలపెల్లి మండలం చాపరాలపల్లికి చెందిన పది మంది మహిళలు కూలీ ముగించుకుని కుమ్మరివాగు దాటుతుండగా కుంజా సీతమ్మ, ఆమె కూతరు వాగులో గల్లంతు అయ్యారు.

అయితే స్థానికులు కూతురిని రక్షించారు. కానీ తల్లి ఆచూకీ ఇంకా లభించలేదు. ఆ మహిళ కోసం పోలీసులు, స్థానికులు గాలిస్తున్నారు. గల్లంతైన తల్లి కోసం కూతురు పెట్టిన రోదనలు మిన్నంటాయి. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక అధికారులతో అత్యవసర మీటింగ్ నిర్వహించి గల్లంతైన మహిళ కోసం గాలింపు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.



Next Story

Most Viewed