రుద్రారంలో ఘోర ప్రమాదం.. అక్కడికక్కడే మహిళ మృతి

by Disha Web Desk 19 |
రుద్రారంలో ఘోర ప్రమాదం.. అక్కడికక్కడే మహిళ మృతి
X

దిశ, అమీన్ పూర్: పటాన్ చెరు మండలం రుద్రారం గ్రామ పరిధిలోని జాతీయ రహదారిపై బైక్‌పై ప్రయాణిస్తున్న దంపతులను వెనక నుండి గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న దంపతులలో భార్య అక్కడికక్కడే మృతి చెందింది. భర్తకు తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన వ్యక్తుల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంలో దంపతులతో పాటు ప్రయాణిస్తున్న మూడేళ్ల చిన్నారి ప్రమాదం నుండి క్షేమంగా బయటపడింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.


Next Story