మహిళకు లోన్‌యాప్ వేధింపులు

by Dishafeatures2 |
మహిళకు లోన్‌యాప్ వేధింపులు
X

దిశ, డైనమిక్ బ్యూరో : కృష్ణాజిల్లా గుడివాడలో లోన్ యాప్ వేధింపుల నుండి తనకు రక్షణ కల్పించాలని బాధితురాలు దిశ పోలీసులను ఆశ్రయించింది. గుడివాడలోని దానియాలపేటలో నివాసం వుండే ఓ మహిళ ఈ నెల 13న ‘మై లోన్ యాప్’నుండి 7,500 రూపాయలు లోన్ తీసుకుంది. వారం రోజుల వ్యవధిలోనే అంటే ఈనెల 19న తీసుకున్న అప్పును వడ్డీతో సహా మొత్తం చెల్లించింది. అయితే గత రెండు రోజుల నుండి గుర్తుతెలియని వ్యక్తి తనకు కాల్ చేసి వేధిస్తున్నట్లు బాధితురాలు నేడు దిశ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివిధ ఫోన్ నంబర్ల నుండి ఆగంతకుడు కాల్ చేసి అదనంగా డబ్బులు కట్టాలని వేధిస్తున్నట్లు పోలీసులకు తెలిపింది.

ఈ నేపథ్యంలో దిశ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బాధితురాలికి భరోసాను కల్పించారు. ఆగంతకుడి నుండి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటామని ఆత్మస్థైర్యాన్ని కలిగించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన గుడివాడ1 టౌన్ పోలీసులు నిందితుడి ఆచూకీ కనిపెట్టే పనిలో ఉన్నారు. ఆన్ లైన్ లోన్ యాప్ ల మాయలో పడి మోసపోవద్దని ప్రజలకు దిశ పోలీసులు సూచించారు.


Next Story

Most Viewed