మహబూబాబాద్ జిల్లాలో దారుణం.. మూడేళ్ల పాపపై అత్యాచారం

by Disha Web |
మహబూబాబాద్ జిల్లాలో దారుణం.. మూడేళ్ల పాపపై అత్యాచారం
X

దిశ, గార్ల: మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో దారుణం జరిగింది. మూడేళ్ల పాపపై ఓ కామాంధుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. వివరాల్లోకి వెళ్తే.. గార్ల మండలం మద్దివంచ గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్త తండాలో అశోక్ (25) అనే కామాంధుడు అదే తండాకు చెందిన మూడేళ్ల పాపపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పాప తల్లిదండ్రులు కూలీ పనికి వెళ్లింది చూసి ఇంట్లో నిద్రిస్తున్న పాపపై నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. పాప పెద్దగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్లు వచ్చి నిందితుడిని పట్టుకున్నారు. అనంతరం స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని నిందితుడిని అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద నిందితుడిపై కేసు నమోదు చేశారు. కుటుంబ సభ్యులు పాపను హాస్పిటల్ లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.


Next Story