విశాఖలో కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. ముగ్గురు మృతి

by Disha Web Desk 19 |
విశాఖలో కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. ముగ్గురు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం రామజోగిపేటలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బుధవారం రాత్రి మూడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడటంతో చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. సమచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని రెస్య్కూ బృందాల సహయంతో సహయక చర్యలు చేపట్టారు.

కాగా, మృతుల్లో అన్న, చెల్లెలు, మరో యువకుడు ఉండగా.. బుధవారం రాత్రే ఆ బాలిక జన్మదిన దినోత్సవ వేడుకల జరుపగా ఇంతలోనే తీవ్ర విషాదం నెలకొంది. కుప్పకూలిన భవనం పురాతనమైనది కావడంతో పాటు ఇటీవల కురిసిన వర్షాల వల్ల కుప్పకూలినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శిథిలాల నుండి మృతదేహాలను బయటకు తీసిన రెస్య్కూ బృందాలు.. సహయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story