బ్రేకింగ్: ఝార్ఖండ్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 13 మంది సజీవ దహనం

by Disha Web |
బ్రేకింగ్: ఝార్ఖండ్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 13 మంది సజీవ దహనం
X

దిశ, వెబ్‌డెస్క్: ఝార్ఖండ్ రాష్ట్రంలో ఘోర విషాద ఘటన చేసుకుంది. ధన్‌బాద్ ప్రాంతంలోని ఓ అపార్ట్ మెంట్‌లో మంగళవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 13 అంతస్తుల ఈ అపార్ట్ మెంట్‌లో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం జరగడంతో మంటలు భారీగా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులు సహా 13 మంది మృతి చెందారు. భారీగా అగ్ని జ్వాలలు ఎగసిపడటంతో తీవ్ర ఆందోళనకు గురైన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే, ఈ అగ్ని ప్రమాదం మొదట అపార్ట్ మెంట్ రెండవ అంతస్తులో చోటు చేసుకుని.. తర్వాత మిగతా అంతస్తులకు మంటలు వ్యాపించినట్లు స్థానికులు తెలిపారు. కాగా, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.Next Story