- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నా భార్యా పిల్లలను బాగా చూసుకోండి.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్

దిశ, హుస్నాబాద్ : దుబాయ్ పంపిస్తానని డబ్బులు తీసుకుని మధ్యవర్తి మోసం చేయడంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన హుస్నాబాద్ నియోజకవర్గంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండలంలోని పోతారం (జె) గ్రామపంచాయతీ పరిధిలోని తుర్కవానికుంట గ్రామానికి చెందిన బోడ శ్రీనివాస్ రెడ్డి (40) వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి భార్య సబిత, ఇద్దరు కూతుళ్లు హర్షిణి, నందిని ఉన్నారు. దుబాయ్‌కి పంపిస్తానని సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లికి చెందిన ఓ వ్యక్తి రూ.4 లక్షలు తీసుకున్నాడు. అప్పుడు, ఇప్పుడు అంటూ కాలయాపన చేస్తూ దాటవేస్తుండడంతో శ్రీనివాస్ రెడ్డి మనస్తాపానికి గురయ్యాడు. తీసుకున్న డబ్బులకు మిత్తి ఎక్కువ కావడం.. దీనికి తోడు అంతకు ముందే తీసుకున్న రూ.8 లక్షలకు కూడా మిత్తి పెరిగిపోవడంతో ఆందోళనకు గురయ్యాడు.
సోమవారం అర్ధరాత్రి కుటుంబ సభ్యులు ఆరుబయట నిద్రిస్తుండగా ఇంట్లోకి వెళ్లి తలుపులకు గడియ పెట్టాడు. సూసైడ్ నోట్ రాసి ఫ్యానుకు చీరతో ఉరి వేసుకున్నాడు. ఇంట్లో శబ్దం వినపడడంతో నిద్ర లేచిన భార్య, తన భర్త కనిపించకపోవడంతో ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. స్థానికుల సహాయంతో తలుపులు తెరిచి కొన ఊపిరితో ఉన్న శ్రీనివాస్ రెడ్డిని కిందికి దించారు. వెంటనే హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. కాగా, సూసైడ్ నోట్‌లో మధ్యవర్తిని వదలిపెట్టొద్దని ఎస్‌ఐ, సీఐలకు విన్నవించాడు. తన పిల్లలను బాగా చూసుకోవాలని బామ్మర్దులను వేడుకున్నాడు. నిన్నటి వరకు అందరితో కలివిడిగా ఉన్న వ్యక్తి అప్పుల బాధ, ఓ వ్యక్తి చేసిన మోసంతో ఆత్మహత్య చేసుకోవడంతో అక్కన్న పేట మండలంలో విషాదఛాయలు అలుముకున్నాయి.