సహాయం చేసి మృత్యు ఒడిలోకి చేరిన విద్యార్థి..

by Disha Web Desk 20 |
సహాయం చేసి మృత్యు ఒడిలోకి చేరిన విద్యార్థి..
X

దిశ, పెద్దపల్లి : రైలు ప్రయాణంలో తాను కూర్చున్న సీటు ఓమహిళకు ఇచ్చిన విద్యార్ధి ప్రమాదాశాత్తు రైలు నుంచి జారీపడి మరణించిన సంఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే మంచిర్యాల జిల్లా తాండూర్​ మండలం ఐబీ ప్రాంతానికి చెందిన ఆవిడపు రోహిత్​ (22) అనే విద్యార్ధి శుక్రవారం ఉదయం బల్లార్షా సిక్రిందాబాద్​ మధ్య నడిచే రైలులో హైదరాబాద్​ కాలేజీకి బయలుదేరాడు.

మార్గ మధ్యలో తాను కూర్చున్న సీటును ఓమహిళకు ఇచ్చిన రోహిత్​ బోగి డోర్​ వద్ద నిలుచున్నట్లు తోటి ప్రయాణికులు తెలిపారు. ప్రమాదావశాత్తు రోహిత్​ పెద్దపల్లి రైల్వేస్టేషన్​ తరువాత కూనారం రైల్వే గేటు సమీపంలో రైలు నుంచి జారీ పడ్డాడు. తీవ్ర గాయాలు అయిన రోహిత్​ మృతి చెందాడు. రైల్వే పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాపు చేస్తున్నారు.


Next Story

Most Viewed