పూజారి దారుణం.. కుటుంబసభ్యలందరినీ చంపి.. చివరికి క్షుద్రపూజలతో..

by samatah |
పూజారి దారుణం.. కుటుంబసభ్యలందరినీ చంపి.. చివరికి క్షుద్రపూజలతో..
X

దిశ, వెబ్‌డెస్క్ : టెక్నాలజీ ఎంత మారినా మూఢనమ్మకాలు అనేవి కొందరిని వీడటం లేదు. మూఢ నమ్మకాల మాయలో పడి చాలా మంది తమ కుటుంబ సభ్యులను కోల్పోతున్నారు. తాజాగా ఉత్తరాఖండ్ డెహ్రాడూన్‌లో దారుణం చోటు చేసుకుంది. తన ఐదుగురు కుటుంబ సభ్యులను పూజారి మహేష్ కుమార్ తివారి అనే వ్యక్తి దారుణంగా చంపేశాడు. తల్లి, భార్యతో పాటు ముగ్గురు కూతుళ్లను గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. అంతటితో ఆగకుండా వారి శవాల ఉండగానే అక్కడే క్షుద్రపూజలు చేశాడు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడి అరెస్ట్ చేశారు. కుటుంబాన్ని ఎందుకు హత్య చేశాడన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story

Most Viewed