రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి..

by Disha Web Desk 20 |
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి..
X

దిశ, కొండపాక : రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కొండపాక మండలం సింగారం గ్రామానికి చెందిన గాలి గాలయ్య గజ్వేల్ ఆర్ అండ్ ఆర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. మే 29న గజ్వేల్ నుంచి కుకునూరుపల్లికి బంధువుల ఇంటికి మోటార్ సైకిల్ పై వెళుతున్న క్రమంలో ముందుగా వెళుతున్న కారు సడన్ బ్రేక్ వేయడంతో కార్ వెనుకవైపు ఢీ కొట్టుకొని కిందపడిపోయాడు.

దాంతో ఆయనకు తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే గజ్వేల్ ఆస్పత్రిలో చికిత్స కోసం తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి ఆర్వీఎం ఆసుపత్రిలో చేర్పించారు. కాగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు ఎస్సై పుష్పరాజ్ తెలిపారు. కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు.

Next Story