మేడ్చల్‌లో ఘోర ప్రమాదం.. అక్కడికక్కడే వ్యక్తి మృతి

by Satheesh |
మేడ్చల్‌లో ఘోర ప్రమాదం.. అక్కడికక్కడే వ్యక్తి మృతి
X

దిశ, మేడ్చల్ టౌన్: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు ప్రకారం.. మేడ్చల్ జాతీయ రహదారిపై చెక్ పోస్ట్‌లోని ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగరీత్యా ఇద్దరు ఇంటి నుండి బయలుదేరారు. మేడ్చల్ పట్టణంలోని వెంకటేశ్వర థియేటర్ వద్దకు రాగానే ఓ వ్యక్తి అకస్మాత్తుగా అడ్డు రావడంతో అతడిని తప్పించబోయి బైక్ పైనుంచి కింద పడిపోయారు. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న లారీ బైక్ పైన ఉన్న వ్యక్తికి ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు బీహార్ ప్రాంతానికి చెందిన హలీం(26)గా గుర్తించారు. సంఘటన స్థలానికి ఎస్సై మురళీధర్ చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.Next Story

Most Viewed