ద్విచక్ర వాహనం పైనుంచి పడి వ్యక్తి మృతి

by Sridhar Babu |
ద్విచక్ర వాహనం పైనుంచి పడి వ్యక్తి మృతి
X

దిశ,నేలకొండపల్లి : ద్విచక్ర వాహనంపై వెళ్తూ అదుపుతప్పి కిందపడి వ్యక్తి మృతి చెందిన ఘటన బుధవారం మండల పరిధిలోని సుద్దేపల్లి క్రాస్ రోడ్డు వద్ద చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం అమీనాబాద్ గ్రామానికి చెందిన లక్ష్మణ్(33) అనే వ్యక్తి నేలకొండపల్లికి వస్తుండగా సుద్దేపల్లి క్రాస్ రోడ్డు వద్దకు చేరుకోగానే బైక్ పైనుంచి అదుపుతప్పి కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో లక్ష్మణ్ తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లక్ష్మణ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story