ఆ వార్త విని రెండంతస్తుల బిల్డింగ్ నుంచి కిందకు దూకాడు

by Javid Pasha |
ఆ వార్త విని రెండంతస్తుల బిల్డింగ్ నుంచి కిందకు దూకాడు
X

దిశ, వెబ్ డెస్క్: వినకూడని వార్త విన్న ఓ వ్యక్తి బాధతో రెండంతస్తుల బిల్డింగ్ నుంచి కిందకు దూకాడు. తీవ్ర గాయాలపాలై ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మార్చి 18న ఢిల్లీలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. నైజీరియాకు చెందిన 37 ఏళ్ల దినోజువో (Ndinojuo) ఢిల్లీలోని ఓ అపార్ట్ మెంట్ లోని రెండో అంతస్తులో నివాసం ఉంటున్నాడు. అయితే ఈ నెల 18న తన తల్లిదండ్రులు చనిపోయినట్లు అతడికి సమాచారం వచ్చింది. దీంతో డిప్రెషన్ లో కి వెళ్లిపోయిన ఆ నైజీరియన్.. తన బాల్కనీలోకి వచ్చి రెయిలింగ్ పట్టుకొని కిందకు దూకడానికి ప్రయత్నించాడు.

అయితే కింద ఉన్న కొంతమంది అది గమనించి వద్దని అతడిని వారించారు. లోపలికి వెళ్లమని స్థానికులు ఎంత చెప్పినా అతడు వినలేదు. పైగా వాళ్లతో గొడవకు దిగాడు. ఈ క్రమంలోనే కంట్రోల్ తప్పిన ఆ యువకుడు రెండంతస్తుల బిల్డింగ్ నుంచి కిందకు జారిపడ్డాడు. ఈ ఘటనలో అతడి కాలు విరగడంతో పాటు చిన్న చిన్న గాయాలయ్యాయి. స్థానికుల సహాయంతో అతడిని సంజయ్ గాంధీ మెమోరియల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ నైజీరియన్ చికిత్స పొందుతున్నాడు. కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

Next Story