- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
ఉమామహేశ్వర కొండ పై తృటిలో తప్పిన ప్రమాదం..

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం రంగాపూర్ గ్రామ సమీపంలో నల్లమల్ల కొండ పై వెలసిన ఉమా మహేశ్వర బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ జాతరలో భాగంగా అచ్చంపేట ఆర్టీసీ డిపో నుండి కొండపైకి ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం కొండ పై నుంచి వస్తున్న ఏపీ 21 జెడ్ 0195 నెంబర్ గల ఆర్టీసీ బస్సు ఉమామహేశ్వర మూడవ ఘాట్ రోడ్డు వద్ద అదుపుతప్పి పక్కకు దూసుకెళ్లింది.
ఈ క్రమంలో బస్సులో సుమారు 60 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. మూల మలుపు వద్ద బస్సు కంట్రోల్ కాకపోవడంతో డ్రైవర్ చాకచక్యంగా ప్రమాదం చోటుచేసుకోకుండా అప్రమత్తతతో గుట్టకు తగిలించి బస్సును నిలిపారు. బస్సులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఘాట్ ఏరియాలో, కొండపైకి కండిషన్ గల వాహనాలను నడపాలని భక్తులు ఆర్టీసీ అధికారులను కోరుతున్నారు.