మెట్‌పల్లిలో దారుణం.. అనుమానంతో భార్యను కిరాతకంగా హతమార్చిన భర్త

by Satheesh |
మెట్‌పల్లిలో దారుణం.. అనుమానంతో భార్యను కిరాతకంగా హతమార్చిన భర్త
X

దిశ, మెట్ పల్లి: అనుమానమే పెనుభూతమై ఓ వ్యక్తి తన భార్యను దారుణంగా హత్య చేసిన ఘటన మెట్ పల్లి పట్టణంలో సంచలనంగా మారింది. పోలీసుల వివరాల ప్రకారం.. పట్టణంలోని గాజుల పేటకు చెందిన శకీర(32) అలియాస్ రుహీ బేగంకు అదే వాడకు చెందిన షకీల్ బేగ్(34) అనే వ్యక్తితో 2008లో వివాహం జరిగింది. కొంత కాలంగా వీరి కాపురం సజావుగానే సాగినప్పటికీ.. గత కొద్ది రోజులుగా షకీల్ భార్యపై అనుమానంతో వేధిస్తున్నాడు. దీంతో రుహీ బేగంకు తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో డిసెంబర్ 3వ తేదీన మెట్ పల్లిలో పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడి కాపురానికి తీసుకెళ్లాడు. అయితే అదేరోజు మరోసారి కొట్టడంతో రుహీ బేగం విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. భార్యభర్తలు గొడపపడటంతో ఇంటి యజమాని షేక్ సయ్యద్ అన్సారీ వెళ్లి చూడగా.. అప్పటికే రుహీ బేగం దారుణ హత్యకు గురైంది. దీంతో తమ కూతురును అతికిరాతకంగా హత్య చేసిన అల్లుడిపై చర్య తీసుకోవాలని మృతిరాలు తల్లి హజరీ బేగం పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ లక్ష్మీనారాయణ తెలిపారు.

Next Story