బైకు అదుపు తప్పి వ్యక్తి మృతి

by Shiva |
బైకు అదుపు తప్పి వ్యక్తి మృతి
X

దిశ, రాజంపేట : అతివేగంతో బైక్ అదుపు తప్పి ఓ వ్యక్తి ప్రాణాలు కొల్పోయిన ఘటన రాజంపేట్ మండల పరిధిలోని ఎల్లారెడ్డిపల్లి గ్రామ శివారులో గురువారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్ఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. కొండాపూర్ గ్రామానికి చెందిన పుట్ట బాలయ్య (53) మేస్త్రి పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం ఉదయం తన వ్యక్తిగత పని నిమిత్తం మెదక్ లో మేస్త్రీ పని ఉందని ఇంట్లో చెప్పి బయలుదేరాడు.

పని ముగించుకుని బైక్ పై తిరిగి వస్తుండగా కొండాపూర్, ఎల్లారెడ్డిపల్లి గ్రామాల మధ్యలో వాగుకు సమీపంలో బాలయ్య బైక్ అదుపు తప్పి రోడ్డుపై పడిపోయాడు. ఈ ప్రమాదంలో బాలయ్య తలక, శరీర భాగాలకు తీవ్ర గాయాలు కాగా అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య మణవ్వ ఫిర్యాదు మేరకు పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజు తెలిపారు.

Advertisement

Next Story