ఈతకు వెళ్లి వ్యక్తి మృతి

by Shiva |
ఈతకు వెళ్లి వ్యక్తి మృతి
X

దిశ, కల్హేర్: ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం మండల పరిధిలోని మహాదేవ్ పల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పార్తి సాయిలు (45) చెరువులో ఈత కోసం వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. విషయం తెలుసుకున్న మండల జడ్పీటీసీ నర్సింహారెడ్డి నారాయణఖేడ్ ప్రభుత్వాసుపత్రికి వెళ్లి మృతుడి కుటంబాన్ని పరామర్శించారు.

Next Story