- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
బాలుడిని చిదిమేసిన లారీ..!
by Aamani |

X
దిశ,నర్సంపేట: పదేళ్ల బాలుడిని లారీ చిదిమేసిన దారుణ ఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పుల్లయ్య బొడు గ్రామంలో చోటుచేసుకుంది. భూక్య జ్యోతి వెంకన్న లకు ఒక కూతురు, కొడుకు ప్రవీణ్ (10) ఉన్నారు. వీరిది ఇల్లు రహదారి పక్కనే ఉంది. మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు గూడూరు నుంచి నెక్కొండ వైపుగా లారీ వేగంగా వస్తుంది. సరిగ్గా పుల్లయ్య బొడు తండా కి చేరుకోగానే రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన లారీ ప్రవీణ్ ని బలంగా ఢీ కొట్టడంతో తల నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సదరు లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. అప్పటిదాకా కండ్ల ముందు కదలాడిన కొడుకు విగతజీవిగా పడి ఉండటం తో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story