- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
జ్యువెలరీ షాప్ దోపిడీలో భారీ ట్విస్ట్.. స్కెచ్ వేసింది అతడే..!

దిశ శంషాబాద్ : బంధువు ఇంటికే కన్నం వేయాలని చేశాడో కన్నింగ్ చుట్టం. వ్యాపారంలో బాగా ఎదిగిపోతుండు.. తను నష్టాల పాలవుతున్నాననే అక్కసుతో బంగారం దుకాణం దోపిడీకి స్కెచ్ వేసి అడ్డంగా దొరికిపోయాడు. ఘటన జరిగిన 12 గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి మీడియా ఎదుట ప్రదర్శించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి వివరాలను వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం..
రాజస్థాన్‌కు చెందిన దిలీప్, మధురామ్ చౌదరి బంధువులు. దిలీప్ మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి మధుబాన్ కాలనీలో సరస్వతి జ్యువెలరీని నడుపుతున్నాడు. ఆయన వ్యాపారం బాగా సాగుతోంది. కాని మధురామ్ చౌదరి వ్యాపారంలో బాగా నష్టపోయాడు. దీంతో ఆయన దృష్టి దిలీప్‌పై పడింది. తన వ్యాపారంలో నష్టాలను పూడ్చుకోవడానికి దిలీప్‌కు చెందిన జ్యువెలరీ దుకాణాన్ని దోచుకోవాలని పథకం పన్నాడు. ఇందుకు గాను రాజస్థాన్‌కు చెందిన గోపారామ్, దినేష్, కైలాష్, మహేష్ కలిసి అక్కడే దోపిడీకి స్కెచ్ వేశారు. తెచ్చిన సొత్తును అందరూ సమానంగా పంచుకోవాలని ఒప్పందం చేసుకున్నారు.
పథకం ప్రకారం.. ఇండోర్‌లో మూడు తుపాకులను కొనుగోలు చేశారు. సోమవారం రాత్రి సరస్వతి జ్యువెలరీ దుకాణానికి వచ్చిన ముఠా.. తుపాకులు చూపించి దోపిడీకి ప్రయత్నించారు. అయితే స్థానికులు అప్రమత్తంగా వ్యవహరించి దొంగల గ్యాంగ్‌ను చాకచక్యంగా పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో మధురామ్ చౌదరి కుట్ర బయటపడింది.12 గంటల్లో నిందితులందరినీ అరెస్ట్ చేసిన పోలీసులు మంగళవారం కోర్టులో హాజరు పరిచారు. ఈ విలేకరుల సమావేశంలో రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్, మైలార్దేవపల్లి ఇన్‌స్పెక్టర్ నరసింహ తదితరులు పాల్గొన్నారు.