తాళం వేసి టెంపుల్‌కు వెళ్లిన ఇంట్లో చోరీ..

by Vinod kumar |   ( Updated:2022-08-22 16:27:11.0  )
తాళం వేసి టెంపుల్‌కు వెళ్లిన ఇంట్లో చోరీ..
X

దిశ, నర్సాపూర్: మొక్కు తీర్చుకునేందుకు ఓ కుటుంబం సభ్యులు గుడికి వెళ్లగా.. ఇంటి తాళం పగులగొట్టి వెండి, బంగారు ఆభరణాలతో పాటు నగదు చోరీ జరిగిన ఘటన మండల పరిధిలోని లింగపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగపూర్ గ్రామానికి చెందిన సత్యనారాయణ వ్రతం మొక్కు తీర్చుకొనేందుకు నాచారం టెంపుల్‌కు కుటుంబ సభ్యులతో కలసి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇదే అదునుగా భావించిన గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగులగొట్టి.. ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. ఇంటికి వచ్చి చూసేసరికి బీరువాలో ఉన్న నాలుగు తులాల పైగా బంగారం, సుమారు 50 వేల నగదు, వెండి ఆభరణాలు చోరీ జరిగినట్లు బాధితులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు చోరీ జరిగిన గృహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.



Advertisement

Next Story

Most Viewed