నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి.. రోడ్లు సరిగ్గా లేక దారుణం!

by Disha Web Desk 19 |
నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి.. రోడ్లు సరిగ్గా లేక దారుణం!
X

దిశ, బూర్గంపాడు: బూర్గంపాడు మండలం పరిధిలోని ఆదివాసీ గ్రామమైన శ్రీరాంపురం కాలనీలో నాలుగు నెలల పసికందు మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. శ్రీరాంపురం కాలనీకి చెందిన శ్యామల వెంకయ్య, రత్నమ్మ దంపతుల నాలుగు నెలల పసికందుకు బుధవారం రాత్రి సమయంలో జ్వరం వచ్చింది. గురువారం ఉదయానికి జ్వరం తీవ్రం కావడంతో కుటుంబ సభ్యులు పసికందును తీసుకుని భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి బయలు దేరారు. కాగా సారపాక నుంచి శ్రీరాంపురం కాలనీ అటవీ ప్రాంతంలో రెండు కిలోమీటర్ల లోపలకు ఉండటంతో ఆ దారి బురదమయంగా మారడంతో వాహనాలు వెళ్లేందుకు వీలులేకుండా పోయింది.

దీంతో కాలి నడనక సారపాక శ్రీరాంపురం కాలనీ రహదారికి చేరుకున్నారు. అక్కడి నుంచి భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తీసుకువెళ్లగా.. పరీక్షించిన వైద్యులు అప్పటికే పసిపాప మృతి చెందిదని చెప్పారు. దీనితో ఆ తల్లిదండ్రులు కన్నీటి పర్యాంతమయ్యారు. ఈసందర్భంగా గ్రామస్థులు పలువురు మాట్లాడుతూ.. గత 20 ఏండ్లుగా ఈ ప్రాంతంలో జీవిస్తున్న నేటికి కనీసం విద్యుత్, రహదారి సౌకర్యం లేదని పేర్కొన్నారు. కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు, పాలకులు విఫలమైయ్యారని ఆరోపించారు. ఇకనైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తక్షణమే కనీస వసతులు కల్పించాలని వారు వేడుకున్నారు.


Next Story

Most Viewed