ఒక్కసారిగా కుప్పకూలిన ఐదంతస్తుల భవనం.. శిథిలాల కింద 60 మంది!

by Disha Web Desk 19 |
ఒక్కసారిగా కుప్పకూలిన ఐదంతస్తుల భవనం.. శిథిలాల కింద 60 మంది!
X

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. రాజధాని లక్నోలోని ఇస్రత్ గంజ్ ప్రాంతంలో సిలిండర్ బ్లాస్ట్ అవ్వడం వల్ల ఓ ఐదంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో ఈ భనవంలో నివసిస్తోన్న 60 మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్య్కూ బృందాలు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు ప్రారంభించాయి. రంగంలోకి దిగిన రెస్య్కూ బృందాలు ఇప్పటి వరకు ముగ్గరుని కాపాడినట్లు సమాచారం. కాగా సహయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొన్నాయి. అయితే, ఈ ప్రమాదంలో మృతుల సంఖ్యల మరింత పెరిగి ఛాన్స్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story