- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
టిన్నర్ డబ్బాలు తరలిస్తున్న ట్రక్కులో అగ్నిప్రమాదం..

దిశ, కార్వాన్ : ట్రక్కులో టిన్నర్ డబ్బాలు తరలిస్తుండగా ట్రక్కు అగ్నకి ఆహుతయిన ఘటన సోమవారం ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. ఆసిఫ్ నగర్ ఇన్స్పెక్టర్ నవీన్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆసిఫ్ నగర్ లోని ఫీల్ ఖానా వద్ద వెంకటేష్ అనే బొలెరో ట్రక్కు డ్రైవర్ టిన్నర్ డబ్బాలను ట్రక్కులో వేసుకొని తరలిస్తుండగా డబ్బామూత సరిగ్గా పెట్టక పోవడంతో డబ్బాలోని టిన్నర్ ట్రక్కు ఇంజిన్ పై పడి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు అదుపులోకి తేవడానికి స్థానికులు విశ్వప్రయత్నాలు చేయగా పలితం లేకుండా పోయింది.
సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకోచ్చారు. ట్రక్కు మాత్రం పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యింది. ఎలాంటి ప్రాణహాని జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంతో ఒక కిలోమీటర్ మేరకు భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. ఈ మేరకు పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.