- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- వైరల్
- పర్యాటకం
- టెక్నాలజీ
- Telugu News
- IPL2023
కొడుకు తల నరికి చంపిన తండ్రి.. తలను సంచిలో వేసుకుని..!

దిశ, డైనమిక్ బ్యూరో : పల్నాడు జిల్లా నకరికల్లు మండలం గుండ్లపల్లి బీసీ కాలనీలో దారుణం జరిగింది. కన్నకొడుకును తండ్రి అత్యంత దారుణంగా తల నరికి హత్య చేశాడు. అనంతరం తలను ఒక సంచిలో కట్టుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. వివరాల్లోకి వెళ్తే గుండ్లపల్లి వడ్డెర కాలనీకి చెందిన బత్తుల వీరయ్య, కిషోర్ తండ్రీ కొడుకులు. కొడుకు కిషోర్ మద్యానికి బానిసగా మారాడు. గతంలో పెళ్లి అయినప్పటికీ గొడవల కారణంగా కిషోర్ భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో తండ్రి వీరయ్యతో కలిసి కిషోర్ జీవిస్తున్నాడు. భార్య పుట్టింటికి వెళ్లిపోవడం తనను అడ్డుకునేవాళ్లెవరూ లేరంటూ నిత్యం మద్యం తాగుతూ నానా రచ్చ చేస్తున్నాడు. అయితే గురువారం అర్థరాత్రి తాగేందుకు డబ్బులు కావాలని తండ్రిని అడిగాడు. తండ్రి వీరయ్య తన వద్ద లేవని చెప్పడంతో కిషోర్ చేయి చేసుకున్నాడు. దీంతో కొడుకు ప్రవర్తనతో విసుగెత్తిపోయిన తండ్రి వీరయ్య కత్తితో కొడుకు తల నరికి చంపేశాడు. అనంతరం తలను సంచిలో వేసుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది.