- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- భక్తి
- ఆరోగ్యం
- ఫోటోలు
- రాశిఫలాలు
- Job Notifications
కరెంట్ షాక్ తో రైతు మృతి

దిశ, గంభీరావుపేట: కరెంట్ షాక్ తో రైతు మృతి చెందిన ఘటన గంభీరావుపేట మండల పరిధిలో జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగంపేటకు చెందిన చెప్పియాల నడిపి బాబు (54) అనే రైతు తనకు ఉన్న అర ఎకరం పొలంలో టమాట సాగు చేస్తున్నాడు. అయితే రాత్రి వేళల్లో పంటకు నీళ్ళు పెట్టేందుకు వెలుతురు కోసం పొలం వద్ద బల్బ్ పెట్టాడు. ఆదివారం రాత్రి ఎప్పటిలాగే పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లిన బాబు.. విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. పొలం దగ్గరికి వెళ్తానని చెప్పి తెల్లారినా రాకపోయేసరికి కుటుంబ సభ్యులు అనుమానం వచ్చి అతడి గురించి చుట్టుపక్కల వెతికారు. మృతుడి పొలం పక్కన ఉన్న వ్యక్తి విద్యుత్ షాక్ తో బాబు మరణించాడని కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. దీంతో పొలం వద్దకు వెళ్లిన మృతుడి భార్య, పిల్లలు బోరున విలపించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మహేశ్ తెలిపారు.