మైహునా తుమ్ లోగ్ భేఫికర్.. 3 రోజుల గడువు కోరిన కిడ్నాపర్లు.?

by Dishafeatures2 |
మైహునా తుమ్ లోగ్ భేఫికర్.. 3 రోజుల గడువు కోరిన కిడ్నాపర్లు.?
X

దిశ ప్రతినిధి, నాగర్ కర్నూల్: హవాలా డబ్బు లావాదేవీల అంశంలో జరిగిన వ్యక్తి కిడ్నాప్ అంశం నాగర్ కర్నూల్ జిల్లాలో పెను దుమారాన్ని రేపుతుంది. ఓ కంపెనీలో పెట్టుబడులు పెడితే హవాలా డబ్బు రూపంలో లక్షకు 25వేలు కమీషన్ తమ ఖాతాల్లో జమ అవుతుండడంతో ఒకరిని చూసి మరీ కొందరు పెట్టుబడులు పెట్టేందుకు ఎగబడ్డారు. అధికార పార్టీకి చెందిన వ్యక్తులతో పాటు ప్రముఖ చిట్టి వ్యాపారులు, ఇతర ఆయా శాఖల్లో పని చేసే కిందిస్థాయి సిబ్బంది సైతం ఈ హవాలా డబ్బు వ్యవహారంలో పెట్టుబడులు పెట్టినట్లు జోరుగా చర్చ నడుస్తుంది. వీరంతా మొదట్లో వచ్చిన హవాలా డబ్బుతో పబ్బులు, టూర్ , శికార్లకెళ్ళి జల్సాలు చేసిన వ్యక్తులకు రెండు నెలలుగా డబ్బులు రాకపోవడంతో అందరూ మోసపోయినట్లు తెరుకున్నారు.

చివరకు పరిచయం చేసిన వ్యక్తికి సంబందించిన ఆస్తులను రాయించుకునెందుకు కిడ్నాప్ పథకాన్ని రచించుకున్నట్లు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసు అధికారులను మేనేజ్ చేసుకుంటూ సదరు వ్యక్తి నుంచి ఎలాగైనా ఆస్తులు రాయించుకొని నష్టాన్ని సవరించుకోవాలని వ్యూహం రచించినట్లు తెలుస్తోంది. కాగా తన భర్తను కొంతమంది వ్యక్తులు కిడ్నాప్ చేసినట్లు ఆరోపిస్తూ లక్ష్మణ్ అనే వ్యక్తి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏదైనా అనుకోని సంఘటన జరిగితే ప్రమాదంలో పడతామన్న ఉద్దేశంతో పోలీసు అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఎలాగైనా పట్టుకుంటామని భరోసా కల్పించి ఇంటికి పంపినట్లు సదరు వ్యక్తి భార్య ఆరోపిస్తోంది. విషయం కాస్త మీడియా ద్వారా బయట పడటంతో కిడ్నాప్ చేసిన వ్యక్తులంతా బుధవారం స్థానిక ఓ ప్రజా ప్రతినిధి వద్దకు వెళ్లి తమ గోడును వెల్లబోసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది.

మేమంతా మోసపోయాం అతను నుండి ఆస్తులు రాయించుకునేంతవరకు మూడు రోజులు సమయం కావాలని కోరడంతో సదరు ప్రజా ప్రతినిధి పోలీసు అధికారులకు మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు చర్చ నడుస్తోంది. అందులో భాగంగానే కిడ్నాప్ వ్యవహారంలో వ్యక్తి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసి నాలుగు రోజులు అవుతున్నా పోలీసు అధికారుల నుంచి ఎలాంటి పురోగతి లేకపోవడం ఇందుకు తార్కానంగా కనిపిస్తోంది. ప్రస్తుతం కిడ్నాప్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల్లో కొంతమంది భూకబ్జా వ్యవహారంలోనూ ప్రమేయం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది ఇలాంటి వ్యక్తులకు ప్రజల ప్రతినిధులు వెనకేసుకొస్తూ అధికారాన్ని దుర్వినియోగం చేయడం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది.



Next Story

Most Viewed