ఆడుకుంటున్న బాలుడి పైకి దూసుకెళ్లిన కారు.. సీసీటీవీ కెమెరాలో భయానక దృశ్యాలు

by Aamani |
ఆడుకుంటున్న బాలుడి పైకి దూసుకెళ్లిన కారు.. సీసీటీవీ కెమెరాలో భయానక దృశ్యాలు
X

దిశ,వెబ్ డెస్క్ : కొన్నిచోట్ల పిల్లలను ఆడుకోవడానికి ఆరుబయట వదిలేస్తుంటారు. వాహనాలు తిరగని ప్రదేశాలలో అయితే ఎలాంటి ప్రమాదం పొంచి ఉండదు. కానీ వాహనాలు తిరుగుతున్న ప్రదేశాలలో కూడా అలానే వదిలేయడం వల్ల పిల్లల ప్రాణాలకే ప్రమాదం. ఓ కంట కనిపెడుతూ ఉన్న ఏ వైపు నుండి మృత్యువు కబళింస్తుందో అర్థం కాని పరిస్థితి. ఇలాంటి ఘటన ఒకటి భువనగిరి హౌసింగ్ బోర్డ్ కాలనీలో చోటు చేసుకుంది.ఆరుబయట ఆనందంగా ఆడుకుంటున్న బాలుడుకిపైకి అతివేగంగా ఓ కారు దూసుకెళ్లింది.దీంతో తీవ్రగాయాలతో ఆ బాలుడు చనిపోయాడు. బాలుడిని కారు ఈడ్చుకెళ్లిన భయానక దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.



Next Story

Most Viewed