- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అగ్రహారం బ్రిడ్జిపై ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన కారు…అక్కడికక్కడే వివాహిత మృతి
by Kalyani |

X
దిశ ఖమ్మం సిటీ; ఖమ్మం నగరం అగ్రహారం బ్రిడ్జి పై ఆదివారం ద్విచక్ర వాహనాన్ని కారు ఢీ కొట్టడంతో ద్విచక్ర వాహనం పై ఉన్న వివాహిత పెండ్యాల భవాని అక్కడికక్కడే మృతి చెందింది. భర్త వినయ్ కు బలమైన గాయాలు తగలడంతో స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. సీఐ భాను ప్రకాష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి… రామకృష్ణాపురం మీదుగా ఖమ్మం వస్తున్న ద్విచక్ర వాహనం నీ విజయవాడ వైపు వెళుతున్న కియా కారు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని తెలిపారు. ఏపీ 40 బి ఎల్ 2949 గల కారు యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Next Story