మరుగుతున్న సాంబారులో పడి 21 ఏళ్ల యువకుడు మృతి

by Mahesh |
మరుగుతున్న సాంబారులో పడి 21 ఏళ్ల యువకుడు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఓ వివాహ వేడుకల్లో తీవ్ర విషాదం నెలకొంది. మరుగుతున్న సాంబారు గిన్నెలో పడి 21 ఏళ్ల యువకుడు తీవ్ర గాయాలతో మృతి చెందాడు. ఈ విషాద సంఘటన తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో ఓ వివాహ వేడుకల్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతి చెందిన వ్యక్తి.. ఓ క్యాటరింగ్ సంస్థలో పార్ట్ టైమ్ గా పనిచేస్తున్న స్థానిక కళాశాల విద్యార్థిగా చెప్పారు. అయితే అతను సాంబార్ గిన్నెను దించే సమయంలో ప్రమాదావశాత్తు అందులో పడిపోయాడని.. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించినప్పటికి తీవ్రంగా కాలడంతో మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు.

Next Story