Crime news:బాలికపై అత్యాచారం చేసిన నేరస్తుడికి 20ఏళ్ల జైలు శిక్ష

by Disha Web |
Crime news:బాలికపై అత్యాచారం చేసిన నేరస్తుడికి 20ఏళ్ల జైలు శిక్ష
X

దిశ, నారాయణపేట ప్రతినిధి: మక్తల్ పట్టణానికి చెందిన మైనర్ బాలికకు మాయ మాటలు చెప్పి బాలికపై పలు మార్లు అత్యాచారం చేసిన నేరస్తుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతోపాటు రూ. 10వేల జరిమానా విధిస్తూ నారాయణపేట జిల్లా కోర్టు మంగళవారం తీర్పు ఇచ్చింది. వివరాల్లోకి వెళితే.. 2020లో మక్తల్ పట్టణం కేశవనగర్‌కు చెందిన కురుమూర్తి ఓ మైనర్ బాలికపై పలుమార్లు అత్యాచారం చేశాడు.

దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్సై ఏ. రాములు కేసు నమోదు చేయగా మక్తల్ సీఐ బి. శంకర్ కేసు విచారణ చేసి ఛార్జీ షీట్ ఫైల్ చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎస్. మురళీకృష్ణ 10 మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టగా జిల్లా జడ్జి మహ్మద్ అబ్దుల్ రఫీ నేరస్తుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.10 వేల జరిమానా విధించినట్లు కోర్టు లైసెన్ ఆఫీసర్ ఏఎస్ఐ బాలకృష్ణ తెలిపారు. అలాగే బాధితురాలికి రూ. 5 లక్షల పరిహారం ఇవ్వాలని జిల్లా జడ్జి ఆదేశాలు జారీ చేశారు.Next Story