కేరళలో పడవ బోల్తా.. ఇద్దరు మృతి.. మరో ఇద్దరు గల్లంతు

by Satheesh |   ( Updated:2022-09-10 16:56:17.0  )
కేరళలో పడవ బోల్తా.. ఇద్దరు మృతి.. మరో ఇద్దరు గల్లంతు
X

దిశ, వెబ్‌డెస్క్: కేరళలో తీవ్ర విషాదం నెలకొంది. రాష్ట్రంలోని చెన్నితాలలో ఉన్న అచ్చన్‌కోవిల్ నదిలో పల్లియోడం (పాము పడవ) బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరు వ్యక్తులు గల్లంతైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో పడవలో మొత్తం 60 మంది ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, వీరంతా ఆదివారం అరన్ముల బోట్ రేస్‌ ఉండటంతో.. ఈ పోటీలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఈ విషాద ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, భద్రతా సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు ప్రారంభించారు. గల్లంతైన వ్యక్తుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed