తీవ్ర విషాదం నింపిన ఫుట్ బాల్ మ్యాచ్.. 174కి చేరిన మృతుల సంఖ్య

by Disha Web |
తీవ్ర విషాదం నింపిన ఫుట్ బాల్ మ్యాచ్.. 174కి చేరిన మృతుల సంఖ్య
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండోనేషియాలోని తూర్పు జావాలో ఫుట్‌బాల్ మ్యాచ్ అనంతరం అభిమానుల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర విషాదం నింపింది. తమ జట్టు ఓటమిని జీర్ణించుకోలేపోయిన అభిమానులు ప్రత్యర్థి టీమ్ ఫ్యాన్స్‌పై దాడికి దిగారు. దీంతో స్టేడియంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘర్షణ తీవ్రరూపం దాల్చడంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు చేసి టియర్ గ్యాస్‌ ప్రయోగించారు. దీంతో ఆందోళనకు గురైన అభిమానులు ఒక్కసారిగా పరుగతీయడంతో స్టేడియంలో తొక్కిసలాట జరిగింది.

తొక్కి సలాట, టియర్ గ్యాస్ వల్ల ఊపిరి ఆడక 129 మంది చనిపోగా.. మరో 100 మంది తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. అయితే, ఈ ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. చికిత్స పొందుతున్న వారిలో చాలా మంది మృతి చెందారు. ఇప్పటి వరకు ఈ ఘటనలో 174 మంది మృతి చెందగా.. 180 మంది గాయపడ్డట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగి అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది.

Next Story

Most Viewed